చైకి దిల్ రాజుతో 2 సార్లు దెబ్బే!

Naga Chaitanya


నాగ చైతన్యని హీరోగా లాంచ్ చేసింది నిర్మాత దిల్ రాజు. ‘జోష్’ సినిమాతో చైతన్య హీరోగా అడుగుపెట్టాడు. ఐతే, ఆ సినిమా అపజయం పాలు అయింది. 2009 సెప్టెంబర్లో విడుదలైన ఆ మూవీ టైంలో భారీగా వర్షాలు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటనలో చనిపోవడం వంటి కారణాల కూడా ఆ సినిమాకి సరైన ఓపెనింగ్ రాకుండా చేశాయి.

ఇన్నేళ్ల తర్వాత దిల్ రాజు మళ్ళీ నాగ చైతన్యతో ఒక సినిమా తీసి విడుదల చేస్తే తెలంగాణ అంతా వానలు, వరదలు. ఆంధ్రాలోనూ వర్షాలు.

ఇక రిజల్ట్ కూడా సేమ్. ‘థాంక్యూ’ ఘోరంగా ఢమాల్. మొదటి రోజు ఎపి, తెలంగాణాలో కలిపి కోటిన్నర మాత్రమే వచ్చింది. మరో రెండు కోట్లు తప్ప ఇంకా ఏమి రాదు. అంటే దారుణ పరాజయం.

దిల్ రాజు ఎందరో హీరోలకు మరుపురాని హిట్లు. కానీ, నాగ చైతన్యకి మాత్రం మరిచిపోలేని గాయాలు మిగిల్చారు.

 

More

Related Stories