దిల్ రాజు ఇప్పుడు హ్యాపీనేనా!

Dil Raju


ప్రముఖ నిర్మాత దిల్ రాజుని టార్గెట్ చేస్తూ మొన్నటి వరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హడావిడి చేసింది. సంక్రాంతి సమయంలో రెండు భారీ తెలుగు సినిమాలు (వీర సింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్య) విడుదల అవుతున్నప్పుడు ‘వారసుడు’ అనే డబ్బింగ్ సినిమా ఎలా విడుదల చేస్తారు అని నిర్మాతల మండలి ప్రశ్నించింది.

ఐతే, మండలి రాసిన లేఖకు తమిళ చిత్ర సీమ నుంచి ఘాటుగా సమాధానం రావడంతో ఒక్కసారిగా తెలుగు నిర్మాతల మండలి మౌనం వహించింది. అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటి సీనియర్ నిర్మాతలు కూడా దిల్ రాజ్ వైపు నిలిచారు. దాంతో, దిల్ రాజ్ కే బలం వచ్చింది.

ఇప్పుడు, ఆయన ‘వారసుడు’ సినిమాని భారీగా విడుదల చేసేందుకు అంతా సెట్ చేశారు. ‘పొంగల్’కే ఈ సినిమా అంటూ ఈ రోజు (నవంబర్ 30) కొత్త పోస్టర్, మొదటి పాట విడుదల చేశారు. సో, ఇక ఇప్పటి నుంచి హంగామా ఉంటుంది.

వీర సింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలకు క్రేజ్ ఉంది. కానీ, ‘వారసుడు’ సినిమాకి మంచి థియేటర్లు పడేలా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా హీరో విజయ్ కి భారీ మార్కెట్ ఉంది. మంచి టాక్ వస్తే వచ్చే కలెక్షన్లు మామూలుగా ఉండవు. అందుకే, దిల్ రాజు ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నారు అని అంటున్నారు.

 

More

Related Stories