దిల్ రాజ్ గ్రేట్ ఎస్కేప్!

Dil Raju

“వి” సినిమాకి దాదాపుగా క్రిటిక్స్ అందరూ ఒకే తీరుగా రేటింగ్ ఇచ్చారు. దర్శకుడు ఇంద్రగంటి “ఆల్ వెజిటుబిల్ మిక్స్” కర్రీ వండాడు అన్నట్లుగ్గానే రాశారు విమర్శకులు. ఈ మూవీ థియేటర్ లో విడుదల అయి ఉంటే ఎలా ఉండేది అనేది ప్రశ్న. థియేటర్ కాకుండా డైరెక్ట్ ఓటిటి ఆప్సన్ కే వెళ్లడమే మంచి నిర్ణయం అని ఇప్పుడు అర్థమైంది.

నిర్మాత దిల్ రాజ్ ఇంకా వెయిట్ చేసి థియేటర్లోనే విడుదల చేద్దామనుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో మాత్రమే చూడాల్సిన “స్టఫ్” ఏముందట? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ విధంగా దిల్ రాజ్ …. సూపర్ గా ఎస్కేప్ అయ్యారు అనే చెప్పాలి.

“వి” సినిమాతో అయన మంచి లాభంతోనే బయటపడ్డారు అమెజాన్ డీల్ పుణ్యమా అని.

Related Stories