దిల్ రాజు ఎప్పట్లానే మౌనం!

Dil Raju

నాని, సుధీర్ బాబు “వి” సినిమా ఓటీటీ డీల్ గురించి గత నాలుగు నెలలుగా డిస్కషన్ లో ఉంది. ఐతే, తాజాగా అమెజాన్ ప్రైమ్ తో డీల్  క్లోజ్ అయిందని వార్తలు రావడంతో కొంత కలకలం రేగింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కు వస్తుందనేది టాక్.

ఐతే దిల్ రాజు మాత్రం ఎప్పట్లానే మౌనం వహిస్తున్నారు. అమెజాన్ ప్రతినిధులు కూడా పెదవి విప్పడం లేదు. జనవరి వరకు సినిమాని ఆపాలా, లేక ఆర్థిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఓటీటీకి ఇవ్వాలా అన్న విషయంలోనే దిల్ రాజు తర్జన భర్జనపడి చివరకు డిజిటల్ డీల్ కి ఒప్పుకొని ఉంటారు అని అంటున్నారు. ఐతే, ఇప్పటివరకు అధికారికంగా ఇంకా ఒప్పందాలు కాలేదట.

ఈ సినిమా శాటిలైట్ టీవీ హక్కులను దిల్ రాజు ఆల్రెడీ జెమినీ టీవీకి అమ్మేశారు. జెమినీ టీవీ, అమెజాన్ ఇంకా మాట్లాడుకోవాలి. ఇంకా కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి…అవన్నీ కొలిక్కి వస్తే… ఆఫిసియల్ గా చెప్తారేమో. అందుకే దిల్ రాజు సైలెంట్ గా ఉన్నారు. ప్రచారాన్ని తోసిపుచ్చడం లేదు, అవును అని చెప్పడం లేదు.

Related Stories