దిల్ రాజు కొడుకు పేరు ఇదేనంట

Dil Raju


ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఇటీవల కొడుకు పుట్టిన విషయం తెలుసు. మరి కొడుక్కి ఏమి పేరు పెట్టారో తెలుసా? తన మొదటి భార్య అనిత, తన రెండో భార్య వైగా పేర్లలోని అక్షరాలు కలిసేలా అన్వయ్ రెడ్డి అనే పేరుని పెట్టారట.

తన భార్య అనిత అకాల మరణం తర్వాత దిల్ రాజు మరో పెళ్లి చేసుకున్నారు. తన కన్నా 20 ఏళ్ల తక్కువ వయసు ఉన్న యువతిని పెళ్లాడారు. ఆమె అసలు పేరు తేజస్విని. పెళ్లి సమయంలో ఆమె పేరుని తేజస్విని నుంచి వైగా రెడ్డిగా మార్చారు. అనిత, వైగా పేర్లు కలిసేలా తన కొడుకు పేరుని అన్వయ్ రెడ్డిగా పెట్టినట్లు మీడియా వార్తలు చెప్తున్నాయి.

దిల్ రాజు అసలు పేరు వెంకట రమణ రెడ్డి. కానీ ఇంట్లో అందరూ రాజు అని పిలుస్తారు. దాంతో, అదే పేరుని ఆయన స్క్రీన్ నేమ్ గా తీసుకున్నారు. అదే పేరుతో పాపులర్ అయ్యారు.

దిల్ రాజు, అనితలకి కూతురు కూడా ఉంది. కూతురుకి ఇద్దరు పిల్లలు.

 

More

Related Stories