
దిల్ రాజు నిర్మాతల్లో బిగ్ సెలబ్రిటీ. చాలా పేరున్న నిర్మాత. ఆయన ఇటీవల తీసిన ‘బలగం’ సంచలనం సృష్టించింది. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ బాగా ఆడుతోంది.
ఇక ఆయన నిజామాబాద్ నుంచి ఎన్నికల బరిలో దిగుతారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రశ్న అడిగితే ఆయన క్లారిటీగా సమాధానం ఇచ్చారు.
“చాలా ఆఫర్లు వస్తున్నాయి. పలు పార్టీల నుంచి పిలుపులు వచ్చాయి. కానీ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎన్నో విమర్శలు, ట్రోలింగ్ చూడాల్సి వస్తోంది. ఇవి భరించడానికే కష్టపడుతున్నాను. ఇక రాజకీయాల్లో అడుగుపెడితే తలకి, మనసుకి రెండింటికి భారం పడుతుంది. అక్కడ వినిపించే విమర్శలు తట్టుకోవాలంటే గుండె నిబ్బరం చేసుకోవాలి,” అని చెప్పారు.
ఇంతకీ అడుగుపెడుతున్నట్లా లేదా అని ప్రశ్నిస్తే తాను విస్పష్టంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదు అని చెప్పొచ్చు.