కొత్త దర్శకులతో రిస్క్ చేయను – దిల్ రాజు

ఒకప్పుడు వరుసపెట్టి కొత్త దర్శకుల్ని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకుల్ని దిల్ రాజే పరిచయం చేశారు. కానీ ఇప్పుడిదే నిర్మాత కొత్త దర్శకులతో రిస్క్ చేయనంటున్నాడు. ఇంతకీ దిల్ రాజు ఎందుకింత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అతడి వెర్షన్ ఏంటి?

“డైరక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే, నిర్మాతను ఓనర్ ఆఫ్ ది షిప్ అనాలి. షిప్ మునిగిపోతే కెప్టెన్ తప్పించుకోవచ్చు కానీ ఓనర్ మాత్రం ఆర్థికంగా మునిగిపోతాడు. ప్రాజెక్టు కరెక్ట్ గా వెళ్తుందా లేదా అనేది ప్రొడ్యూసర్ చూసుకోవాలి. వాళ్లకు కావాల్సినవి సమకూర్చి పెట్టాలి. ప్రాజెక్టు పక్కకెళ్తోంది అనిపించినప్పుడు, అనీల్ రావిపూడి లాంటి డైరక్టర్ కు చెబితే సరిపోతుంది. కొత్త దర్శకుడైతే కూర్చోబెట్టి చెప్పాల్సి ఉంటుంది. అందుకే కొత్త దర్శకుల విషయంలో నేను రిస్క్ చేయను. సీన్ టు సీన్ డిస్కస్ చేసిన తర్వాతే సెట్స్ పైకి వెళ్తాను. కొత్త దర్శకుల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాను, అస్సలు రిస్క్ తీసుకోను.”

ఇలా కొత్త దర్శకుల్ని పరిచయం చేసే విషయంలో తన అభిప్రాయాన్ని  బయటపెట్టాడు దిల్ రాజు. భవిష్యత్తులో కొత్త దర్శకుల్ని పరిచయం ఉద్దేశం ఉందని చెబుతూనే.. ఇప్పట్లో అలాంటి ప్రాజెక్టులు లేవని కూడా అంటున్నాడు. శంకర్, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి లాంటి దర్శకులతోనే పని చేస్తున్నాడు.

 

More

Related Stories