దిల్ రాజ్ నోటికి తాళం వెయ్యాలి!

Dil Raju


హీరోలకు ఉన్నట్లుగా ఒక క్రేజ్ ఉన్న నిర్మాత దిల్ రాజ్. ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో ఎవరికీ దిల్ రాజ్ కున్నంత పాపులారిటీ లేదు. అందుకే, ఆయన ఎక్కువగా మీడియాలో కనిపిస్తారు. ఆయన ప్రతి మాటాకి వ్యాల్యూ ఉంటుంది.

ఐతే, ఇటీవల దిల్ రాజ్ తన నోటిని అదుపులో పెట్టుకోవడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఆచితూచి మాట్లాడాల్సిన ఈ సీనియర్ నిర్మాత ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తున్నారు. అదే ఇప్పుడు వివాదాలకు కారణం అవుతోంది.

ALSO READ: Neither degraded nor elevated any star: Dil Raju

“నేను అందగాణ్ణి కాబట్టి నాకు వివాదాలు ఎక్కువ,” “అజిత్ కన్నా విజయ్ పెద్ద హీరో కాబట్టి విజయ్ సినిమాకే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి” వంటి స్టేట్మెంట్లు దిల్ రాజ్ నుంచి వచ్చాయి. ఈ స్టేట్ మెంట్లు వింటే దిల్ రాజ్ నిజంగా తన టంగ్ విషయంలో కంట్రోల్ తప్పినట్లు అర్థమవుతోంది. అంత సుదీర్ఘమైన కెరియర్, 50 సినిమాలు నిర్మించి ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజ్ అజిత్, విజయ్ విషయంలో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం సిల్లీ చర్య.

దిల్ రాజ్ ఇప్పటికే తెలుగునాట పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యడానికి, వాళ్ళ డేట్స్ పొందడానికి నానా తిప్పలు పడుతున్నారు. తాజా స్టేట్మెంట్ తో ఆయనకి తమిళనాట కూడా హీరోల డేట్స్ అందుకోవడం కష్టం అవుతుంది. బాలీవుడ్ లో రెండు ఎదురుదెబ్బలు ఇప్పటికే తగిలాయి.

 

More

Related Stories