పాట పాడిన దిల్ రాజు

- Advertisement -
Dil Raju


ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ లో మంచి గాయకుడు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అయన బాత్రూం సింగర్ కాదు. స్టేజి మీద కూడా పర్ఫర్మ్ చేసేంత సింగింగ్ టాలెంట్ ఉంది.

ఇటీవల కరీంనగర్ లో జరిగిన ఒక ఈవెంట్ కి ఆయన అతిధి. అక్కడ మ్యూజికల్ పెరఫార్మన్స్ ఇస్తున్న బ్యాండ్… దిల్ రాజ్ ని స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడాల్సిందిగా కోరారు ఆ బ్యాండ్ సింగర్స్. మొహమాటంగానే మైక్ అందుకున్న దిల్ రాజ్ పాట మొదలెట్టారు. మొదట్లో బెరుకుగా పాడిన ఆయన ఆ తర్వాత లీనమయ్యి ఎంజాయ్ చేస్తూ రెచ్చిపోయారు.

“హలో గురు ప్రేమ కోసమే జీవితం” అంటూ ‘నిర్ణయం’ సినిమాలోని పాటను దిల్ రాజు స్టేజిపై పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. చూస్తేంటే ఆయనతో ఎవరో ఒకరు సినిమాలో కూడా పాడిస్తారేమో.

రామ్ గోపాల్ వర్మ గాయకుడు అయినప్పుడు దిల్ రాజ్ పాడితే తప్పేంటి? ఏమంటారు?

 

More

Related Stories