దిల్ రాజు కాన్ఫిడెన్స్ అదుర్స్!

Dil Raju


‘వకీల్ సాబ్’ సినిమాపై దిల్ రాజు మామూలు ధీమాగా లేరు.

“ఎందుకుండొద్దు చెప్పండి? సినిమా చూశాను. ఐ యామ్ టోటల్లీ హ్యాపీ. ఇక అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూడండి. ఆదివారం వరకు నిండిపోయాయి. ఎన్ని షోలు యాడ్ చేసినా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. ఇంకా అమెరికాలో కూడా అలాగే ఉంది. బుకింగ్స్ అక్కడ కూడా బాగున్నాయి అని మా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడే చెప్పారు,” దిల్ రాజు ఆనందం అది.

“ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్, ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సినిమా ఓపెనింగ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఉప్పెన, జాతి రత్నాలు వంటి చిత్రాలకు బుకింగ్స్ ఎలా వెళ్లాయో మనకు తెలుసు. జనాలకు ట్రైలర్స్ చూసి ఒక డెసిషన్ కు వచ్చేస్తున్నారు,” అని క్లారిటీగా చెప్పారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం దిల్ రాజుకి డ్రీం. “22 ఏళ్లుగా అనుకుంటున్నా. ఇప్పటికి నెరవేరింది. 2019 డిసెంబర్ లో మొదలు పెట్టాము, 2020 సమ్మర్లో విడుదల చేద్దామనుకున్నాం. కానీ కరోనా వల్ల ఏడాది ఆలస్యం అయింది. అయినా పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ట్రెండ్ చెప్తోంది,” అని ఫుల్ జోష్ గా చెప్తున్నారు దిల్ రాజు.

ఇది ‘పింక్’ అనే సినిమాకి రీమేక్. ఆ కథని చెడగొట్టారా? పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం ఉంటారా? ఈ డౌట్స్ అందరిలో ఉన్నాయ్. దానికి ఆయన ఇచ్చిన సమాధానం…. “పింక్ స్ఫూర్తి దెబ్బతినదు. తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని అనిపించేలా తీశారు శ్రీరామ్ వేణు. కత్తి మీద సాములాంటి ప్రాజెక్ట్ ఇది. కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ కు తగినట్లు వకీల్ సాబ్ ఉంటుంది.”

“హీరో 15 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తారు,” అని దిల్ రాజు చెప్పారు.

ఇక అల్లు అర్జున్ తో కూడా సినిమా ఉంటుంది అని అంటున్నారు. “జులైలో రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా మొదలు అవుతుంది. చైతన్య తో విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తీస్తున్న ‘థాంక్యూ’ కూడా చివరి దశకు చేరుకొంది. రౌడీ బాయ్స్, పాగల్ వంటి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు అనౌన్స్ చేసిన శ్రీరామ్ వేణు – అల్లు అర్జున్ మూవీ ఆగిపోలేదు. అది తప్పకుండా జరుగుతుంది. కానీ ఎప్పుడు అనేది బన్నీ డిసైడ్ చెయ్యాలి,” దిల్ రాజు మాట ఇది.

More

Related Stories