హోమ్ క్వారంటైన్ లో దిల్ రాజు!

Dil Raju

‘వకీల్ సాబ్’ టీంలో ఇప్పటికే నివేథా థామస్ కి కరోనా వచ్చింది. సినిమా ప్రొడక్షన్, ప్రమోషన్ టీంలో ఉన్న వారు కూడా కరోనా బాధితులే. పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. లేటెస్ట్ గా దిల్ రాజు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ రోజు జరిగిన ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ కి అందుకే రాలేకపోయారు.

ఆయనని కూడా డాక్టర్స్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా సూచించారట. దాంతో, ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ప్రెస్ మీట్లు, ఫంక్షన్లను కొన్నాళ్ళు వాయిదా వేయడమే కరెక్ట్. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కరోనా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో బాగా స్ప్రెడ్ అవుతోంది.

More

Related Stories