ఇక గోవాలో సంబరాలు!

- Advertisement -

నిన్న నైట్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో తన 50వ బర్త్ డే సంబరాలు జరుపుకున్న దిల్ రాజు… ఇక ఫ్యామిలీతో పర్సనల్ గా సెలెబ్రేషన్స్ జరుపుకోనున్నారు. భార్య వైగా రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన గోవాకి వెళ్లారు. అక్కడే ఇక సెలెబ్రేషన్స్.

నిన్నటి పార్టీతో మూవీ ఇండస్ట్రీలో దిల్ రాజు పవర్ ఏంటో తెలిసింది. మరోవైపు, 50వ బర్త్ డే సందర్భంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు.

“ఇప్పటివరకు జీవితం వేరు. ఇకపై వేరు. సినిమాల నిర్మాణం… ఆ వ్యవహారం ఎలాగూ ఉంటుంది. ఇకపై ఛారిటీపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. జెన్యూనుగా అవసరం ఉన్నవాళ్లకు. మంచి ర్యాంక్ వచ్చి, సీట్ వచ్చినా ఆర్థిక స్తొమత లేక ఇబ్బంది పడేవారికి హెల్ప్ చేస్తాను. విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో ఛారిటీ చేస్తా,” అని దిల్ రాజు చెప్పారు.

 

More

Related Stories