కూతురు బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

Dil Raju

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కూతురు అంటే పంచ ప్రాణాలు. కూతురు హన్షిత రెడ్డి కోసం ఏమైనా చేస్తాడు. 50 ఏళ్ల దిల్ రాజుకి చిన్న వయసులోనే పెళ్లి అయింది. ఆయన కూతురు హన్షిత రెడ్డి 30లోకి అడుగుపెడుతోందిప్పుడు. ఆమె 30వ బర్త్ డేకి దిల్ రాజు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడట.

ఆమె బర్త్ డేని చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసి గాల్లోనే బర్త్ డే సెలెబ్రేట్ చేశాడట. అదే ఫ్లైట్ లో ఒక రిసార్ట్ కి వెళ్లారు. ఆ ఫోటోలని ఆమె షేర్ చేసింది.

దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డికి పెళ్లి అయింది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా. కానీ కూతురు కోసం ఇప్పటికీ ఎన్నో గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇటీవలే హైదరాబాద్ జూబిలీహిల్స్ లో పెద్ద బిల్డింగ్ కట్టి ఇచ్చాడు. హన్షితకి కూడా తండ్రి అంటే ప్రాణం. తల్లి అనిత మూడేళ్ళ క్రితం అనారోగ్యంతో కన్ను మూయడంతో తండ్రికి తనే దగ్గరుండి మళ్ళీ పెళ్లి చేయించింది.

More

Related Stories