దిల్ రాజు మాజీ పార్ట్నర్ ఖుషీ

Jathi Ratnalu

దిల్ రాజుతో మొదటి నుంచి కలిసి అటు డిస్ట్రిబ్యూషన్/సినిమా నిర్మాణం, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు లక్ష్మణ్. దాదాపు 17 ఏళ్ల పాటు సాగింది వారి పార్ట్నర్ షిప్. ఐతే, ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయి. బ్రిడ్జ్ అనే పేరుతో ఆయన సొంతంగా అపార్ట్ మెంట్లు కడుతున్నారు. అదే పేరుతో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు.

తొలి ప్రయత్నంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన మూవీ…”జాతి రత్నాలు”. నైజామ్, వైజాగ్ ఏరియాల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఆయన పంట [పండింది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బోణి అదుర్స్ అనడంతో ఆయన ఖుషీగా ఉన్నాడు. మరిన్ని సినిమాలు ఆయన చేతికి చిక్కుతాయి.

ఇప్పటికే నైజాంలో దిల్ రాజుకి చెక్ పెట్టాడు వరంగల్ శీను అనే కొత్త డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు లక్ష్మణ్ కూడా దూసుకొచ్చారు.

More

Related Stories