వకీల్ సాబ్ కోసమే తిరుమల యాత్ర?

- Advertisement -

నిర్మాత దిల్ రాజు మరోసారి సతీసమేతంగా తిరుమల వెళ్లారు. ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. తేజశ్విని అలియాస్ వైఘా రెడ్డితో కలిసి దిల్ రాజు ఇలా తిరుమల వెళ్లడం ఇది వరుసగా రెండో సారి.

లాక్ డౌన్ టైమ్ లో మే 10వ తేదీన నిజామాబాద్ లోని ఓ గుడిలో తేజశ్వినిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. ఈ పెళ్లికి దిల్ రాజు కుమార్తెతో పాటు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి తొలిసారి జూన్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు మరోసారి తిరుమలకు వెళ్లారు.

పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “వకీల్ సాబ్” లాక్ డౌన్ తర్వాత తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నిర్మించిన ‘V’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే.

 

More

Related Stories