- Advertisement -

50 దాటిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆయన భార్య అనిత కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో, ఆయన కరోనా మొదటి వేవ్ లోనే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య వైగా రెడ్డి తల్లి కాబోతుందట.
వైగా రెడ్డి డెలివరీ టైం దగ్గర పడటంతో దిల్ రాజు కూడా సినిమాల నిర్మాణంలో తన ఇన్వాల్వ్ మెంట్ తగ్గించనున్నాడట. ఆయన కూతురు, సోదరుడు, సోదరుని కొడుకు… ఇలా కీలక కుటుంబ సభ్యులు అందరూ ఆయన సినిమాల ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చూసుకుంటున్నారు.
సో, దిల్ రాజు ఇంట్లో మరో వారసుడు/రాలు అడుగుపెట్టే టైం దగ్గరపడింది.
రామ్ చరణ్ – శంకర్ చిత్రం, జెర్సీ హిందీ రీమేక్, హిట్ హిందీ రీమేక్, ఎఫ్ 3, శాకుంతలం, తమిళ అగ్ర హీరో విజయ్ మూవీ… ఇలా పలు భారీ చిత్రాలు దిల్ రాజ్ బ్యానర్లో రూపొందుతున్నాయి.