అనాథ పిల్ల‌ల‌కు బాస‌ట‌గా దిల్‌రాజు

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.

యాదాద్రి జిల్లా ఆత్మ‌కూరు గ్రామంలో గ‌ట్టు స‌త్త‌య్య ఏడాది క్రితం అనారోగ్యంతో క‌న్నుమూశారు. భ‌ర్త‌పై బెంగ‌తో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం క‌న్నుమూశారు. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌ అనాథ‌ల‌య్యారు. ఈ విష‌యాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, స‌ద‌రు గ్రామ స‌ర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్‌లో ప్ర‌త్యేకంగా మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్‌రాజు. త‌న కుటుంబం స్థాపించిన ‘మా ప‌ల్లె’ చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా పిల్ల‌ల‌ను బాగోగులును చూసుకుంటాన‌ని దిల్‌రాజు ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. అడ‌గ్గానే అనాథ‌ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.

Advertisement
 

More

Related Stories