అందాల భామ ఆశలు!

డింపుల్ హయతి.. ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్. మోస్ట్ ఎట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగిన ఈ బ్యూటీకి, అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా క్రేజ్ కు అడుగు దూరంలో ఆగిపోతోంది.

డింపుల్ ను చూస్తే చాలామంది ‘ఖిలాడీ’ సినిమానే ఆమె ఫస్ట్ మూవీ అనుకుంటారు. కానీ ‘ఖిలాడీ’ కంటే చాలా ఏళ్ల కిందటే ఆమె తెలుగులో సినిమాలు చేసింది. ఉన్నంతలో ‘గద్దలకొండ గణేశ్’లో చేసిన స్పెషల్ సాంగ్ తో ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత రవితేజ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది.

కానీ ఖిలాడీ ఫ్లాప్ అవ్వడంతో డింపుల్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో మరో బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.

ప్రస్తుతం డింపుల్ తన ఆశలన్నీ గోపీచంద్ సినిమాపై పెట్టుకుంది. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఈ సినిమాలు తన కెరీర్ కు ప్లస్ అవుతాయని భావిస్తోంది.

 

More

Related Stories