డాన్స్ అంటే ఇష్టం: డింపుల్

- Advertisement -
Dimple Hayathi

గడ్డలకొండ గణేష్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించి పాపులర్ అయింది డింపుల్ హయతి. ఆ సాంగ్ తో రవితేజ సరసన నటించే అవకాశం వచ్చింది. ‘ఖిలాడి’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్ గా డింపుల్ నటించింది. ఈ అందాల భామ పలు విషయాల్లో తన మనసు విప్పింది. ఈ సినిమా గురించి విశేషాలను బయట పెట్టింది.

– ‘ఖిలాడి’లో ఇద్దరు హీరోయిన్లు అనగానే భయమేసింది. నా పాత్ర తగ్గిస్తారేమో అని అనుకున్నా. కానీ సినిమా చూశాక సంతృప్తి లభించింది. చెప్పిందే తీశారు దర్శకుడు రమేష్ వర్మ.

– నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో మూడు పాటలు చేశా. దేనికవే భిన్నం. లంగా ఓణితో, ఫుల్ మాస్ అవతారంలో గ్లామ‌ర్ రోల్ సాంగ్ చేశా.

– ఇప్పుడ‌యితే ఐటం సాంగ్ లు చేయ‌లేను. హీరోయిన్ అవకాశాలే కావాలి. హీరోయిన్ గా స్థిరపడ్డాక మళ్లీ ఐటెం సాంగ్స్ చేస్తాను.

– ‘ఖిలాడి’లో కేచ్ మి సాంగ్ చేయ‌డానికి ముందు లావుగా వున్నా. ద‌ర్శ‌కుడు న‌న్ను 6 కేజీలు త‌గ్గ‌మ‌న్నారు. త‌గ్గాక ఆ సాంగ్ చేశాను. రెండు నెల‌ల‌పాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయ‌డానికి డైట్‌తోపాటు వ్యాయామం చేశాను.

  • మొదట్లో నల్లగా ఉన్నాను అని హేళన చేశారు. ఇప్పుడు సెక్సీ అంటున్నారు.
 

More

Related Stories