బాయ్ ఫ్రెండ్ మేటర్ ఇలా బయటపడింది


పలువురు హీరోయిన్లకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో సహజీవనం చేస్తున్నారు. ప్రియా భవాని శంకర్, పాయల్ రాజ్ పుత్ వంటి వారు తమ బాయ్ ఫ్రెండ్స్ ని సెట్స్ కి కూడా తీసుకొస్తారు. ఇక హీరోయిన్ డింపుల్ హయతి కూడా చాలా కాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోంది. కాకపోతే, ఆ విషయాన్ని ఆమె దాచింది.

ఇపుడు పోలీస్ కేసు పుణ్యమా అని అది బయటపడింది. డింపుల్ హయతి జూబిలీ హిల్స్ లోని ఒక అపార్ట్ మెంట్ లో రెంట్ కి ఉంటోంది. ఆమెతో ఆమె బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ కూడా కలిసే ఉంటున్నాడు అనే విషయం బయటికొచ్చింది ఇప్పుడు.

అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న పోలీస్ అధికారి రాహుల్ హెగ్డేతో డింపుల్, ఆమె బాయ్ ఫ్రెండ్ పార్కింగ్ విషయంలో చాలా కాలంగా గొడవపడుతున్నారట. ఇటీవల డింపుల్ తన కాలితో ఆ పోలీస్ అధికారి కారుని తన్ని, ఆయన కారుకి అడ్డంగా తన కారు పెట్టి గొడవ చేసిందట. ఆమె ప్రవర్తనని ప్రశ్నించిన కానిస్టేబుల్ చేతన్ కుమార్ తో ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ దురుసుగా ప్రవర్తించారట. దాంతో, ఆ కానిస్టేబుల్ ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

అలా, డింపుల్ హయతి తన బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోందన్న విషయం లీక్ అయింది.

 

More

Related Stories