సాయిపల్లవి కలలోకి వస్తోందంట

Sai Pallavi

చాలామంది హీరోయిన్లు ప్రేక్షకుల కలల్లోకి వస్తుంటారు. గిలిగింతలు పెడుతుంటారు. కానీ ఇది అలాంటి కల కాదు. దర్శకుడు వేణు ఊడుగుల కన్న కల. తన కలలో ప్రతి రోజూ సాయిపల్లవి కనిపించేదని చెప్పుకొచ్చాడు వేణు ఊడుగుల. అప్పటికి ఆమెను కనీసం ఒక్కసారి కూడా కలవలేదంట.

విరాటపర్వం స్టోరీ రాయడానికి కూర్చున్నాడు వేణు ఊడుగుల. జమ్మిగుంట అనే ఊరు. ఆ ఊరి బోర్డు పక్కనుంచి సాయిపల్లవి బ్యాగ్ వేసుకొని ఊరి నుంచి నడుస్తూ వస్తుంటుంది. ఈ సీన్ రాసుకున్నప్పుడే సాయిపల్లవిని ఊహించుకున్నాడట దర్శకుడు వేణు ఊడుగుల. ఈ స్టోరీ రాసుకున్న రోజుల్లో ప్రతి రోజూ తనకు కలలో సాయిపల్లవి కనిపించేదని ఆయన చెప్పుకొచ్చాడు.

తన ఊరు పక్కనే జమ్మిగుంట ఉందని, అక్కడ సాయిపల్లవిని కొన్ని వందల సార్లు ఊహించుకున్నానని అన్నాడు. అఁదుకే ట్రయిలర్ లో కూడా అదే షాట్ పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఈ కథ రాసే క్రమంలో తనకు సాయిపల్లవి తప్ప, మరో హీరోయిన్ తట్టలేదని చెప్పుకొచ్చాడు. ఏ రోజు ఏ సీన్ రాసినా అందులో సాయిపల్లవి ఎక్స్ ప్రెషన్స్ ఊహించుకున్నానని అన్నాడు.

అయితే హీరో విషయంలో మాత్రం తనకు ఎలాంటి ఆలోచన లేదని, స్టోరీ రాసుకొని కథ వినిపించటం మొదలుపెట్టిన తర్వాత రానా, తన స్టోరీకి సరిగ్గా సరిపోతాడని అనిపించినట్టు వెల్లడించాడు.

 

More

Related Stories