ఊపిరి పీల్చుకున్న కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీకి ఒకప్పుడు యమా క్రేజ్ ఉండేది. ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన ఫామ్ కోల్పోయారు. ‘పైసా’, ‘నక్షత్రం’ వంటి సినిమాలు చూసిన తర్వాత కృష్ణవంశీని తెగ అభిమానించిన వారు కూడా అయ్యో అనుకున్నారు. అందుకే, ఆయన తాజా చిత్రం ‘రంగమార్తాండ’ చూసిన వారు కృష్ణవంశీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని సంతోషపడుతున్నారు.

‘రంగమార్తాండ’ నిజానికి ఒక రీమేక్ చిత్రం. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమా ఆధారంగా తీశారు. అయినా తెలుగులో కూడా కృష్ణవంశీ ఎమోషనల్ గా తీసినట్లు రివ్యూస్ చెప్తున్నాయి. కొందరు పాతకాలం సెంటిమెంట్ అని పెదవి విరిచినా ఎక్కువ శాతం ప్రశంసలే దక్కాయి.

మొత్తమ్మీద, కృష్ణవంశీ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆయన ధైర్యంగా కొత్త సినిమాలు చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆయనతో సినిమా అనౌన్స్ చేసి వెనక్కి తగ్గినవాళ్ళు ఇప్పుడు ముందుకొస్తారేమో.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఒక మోస్తరుగా ఉన్నాయి. కలెక్షన్ల కన్నా కృష్ణవంశీకి ఇది డైరెక్టర్ గా పెద్ద రిలీఫ్.

Advertisement
 

More

Related Stories