బాండ్ పేపర్ మీద రాసిస్తాడట

“సినిమా బాగుంటుంది…త్రీడీలో అదిరిపోతుంది….నా మాట నమ్మండి.”

ఇది దర్శకుడు ఓం రౌత్ మాట. ఐతే, టీజర్ చూసి డంగైపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తెగ తిడుతున్నారు. దాంతో లాభం లేదని తాజాగా థియేటర్లలో “త్రీడీ” టీజర్ ని ప్రదర్శించారు. ఏపీ, తెలంగాణ అంతటా 60 థియేటర్లలో టీజర్ ని 3డిలో చూపించారు.

త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు, అభిమానులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఐతే, ఇప్పటికీ కొందరికి ఈ సినిమా మీద అపనమ్మకం ఉంది. అందుకే, ఓం రౌత్ వెరైటీగా ప్రామిస్ చేస్తున్నాడు అభిమానులకు.

“నేను చెప్పింది నిజం అవుతుంది. జనవరి 12న థియేటర్లో సినిమా చూసిన వారెవ్వరూ డిసప్పాయింట్ కారు. ఈ మాట నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా,” అని ప్రామిసరీ నోట్ పై ప్రామిస్ చేస్తున్నాడు ఓం రౌత్. ఇప్పటివరకు ఏ దర్శకుడు అభిమానులకు ఇలా బాండ్ పేపర్ ప్రామిస్ లు చేయలేదు.

‘ఆదిపురుష్’ రామాయణం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

 

More

Related Stories