పరశురామ్ కు మళ్లీ గ్యాప్ తప్పదా?

అప్పుడెప్పుడో గీతగోవిందం సినిమా తీశాడు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత సర్కారువారి పాట సినిమా తీశాడు పరశురామ్. అలా రెండు సినిమాల మధ్య లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో కరోనా/లాక్ డౌన్ వచ్చిందని అనుకున్నప్పటికీ.. మరోసారి ఈ దర్శకుడి కెరీర్ లో గ్యాప్ తప్పేలా లేదు.

లెక్కప్రకారం, నాగచైతన్య హీరోగా ఓ సినిమా తీయాలి పరశురామ్. ఆ విషయాన్ని ఈ దర్శకుడు తాజాగా ప్రకటించాడు కూడా. చైతూతో కలిసి సెట్స్ పైకి వెళ్తానని చెప్పుకొచ్చాడు. అయితే చైతూ ఈసారి సిద్ధంగా ఉన్నట్టు లేడు.

వెబ్ డ్రామా షూట్ పూర్తి చేసిన నాగచైతన్య, త్వరలోనే థాంక్యూ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాడు. వీటితో పాటు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. పరశురామ్ మూవీ కంటే ముందు వెంకట్ ప్రభు సినిమానే సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

అదే కనుక జరిగితే పరశురామ్, మరికొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సిందే. పోనీ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి ట్రై చేశాడంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. సర్కారువారి పాటకు ముందు అదే జరిగింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య చైతూ సినిమాను పరశురామ్ పక్కనపెట్టాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా చైతూ సినిమాకే కట్టుబడి ఉన్నాడు పరశురామ్.

 

More

Related Stories