- Advertisement -

‘బడిపంతులు’ దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి ఇక లేరు. పి.సి.రెడ్డిగా పాపులర్ అయిన దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకి 86 ఏళ్ళు.
అలనాటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబులందరిని డైరెక్ట్ చేశారు. కృష్ణ హీరోగా ఎక్కువ సినిమాలు తీశారు ఆయన.
మానవుడు దానవుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, అన్నా వదిన, పెద్దలు మారాలి, అన్నా చెల్లెలు వంటి చిత్రాలు ఆయన తీసినవే. 90 వరకు సినిమాలు తీసిన ఘనత ఆయన సొంతం.