
‘పెద్దన్నయ్య’, ‘పెద్దింటి అల్లుడు’ వంటి హిట్ చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
వంశోద్ధారకుడు, సుల్తాన్, చాదస్తపు మొగుడు, అత్తాకోడళ్లు, కాలేజ్ బుల్లోడు వంటి ఇతర చిత్రాలు కూడా తీశారు. మసాలా ఎంటర్టైన్మెంట్ తో కూడిన చిత్రాలు తీయడంలో ఆయన శైలి వేరు. బాలకృష్ణ, సుమన్ వంటి హీరోలతో ఎక్కువ సినిమాలు తీసి విజయాలు సాధించారు.
ఆయన నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో నేను ‘సుల్తాన్’, ‘వంశానికొక్కడు’, ‘పెద్దన్నయ్య’, ‘వంశోద్ధారకుడు’ సినిమాలు చేశాను. ఈ రోజు ఆయన మరణ వార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్థపరుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి,” అని బాలకృష్ణ తన సంతాప ప్రకటనలో తెలిపారు.
రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.