‘సఖి’కి ‘ఖుషి’కి లింక్ లేదు!

Director Siva Nirvana about Kushi

దర్శకుడు శివ నిర్వాణ “నిన్ను కోరి”, “మజిలీ”, “టక్ జగదీశ్” వంటి సినిమాలు తీశారు. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం.. “ఖుషి”. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. శివ నిర్వాణ గత చిత్రాలు మణిరత్నం పాత చిత్రాలను కాపీ కొట్టి తీసినట్లు అనిపించాయి. ఇప్పుడు ఈ కొత్త సినిమా కథ కూడా మణిరత్నం తీసిన “సఖి”లా ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

“సఖి లాంటి పాయింట్ తో నేను ఈ సినిమా తీశాను అని అందరూ అంటున్న మాట నా వరకు వచ్చింది. కానీ పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత వచ్చే సమస్యలను డీల్ చేస్తూ అనేక సినిమాలు గతంలో వచ్చాయి. “ఖుషి”లో ఇప్పటివరకు రాని ఒక యూనిక్ పాయింట్ ఉంది,”అని అన్నారు శివ నిర్వాణ.

“మణిరత్నం సినిమాలు అంటే నాకు ఇష్టం. కానీ ఆయనలా తీయాలనుకోను. తీయలేను. ఆయన సినిమాల స్ఫూర్తి ఉంటుంది కానీ వాటినే తీయను. ఇంకా చెప్పాలంటే మణిరత్నం గారిలా ఒక్క ఫ్రేమ్ పెట్టడం ఇంకొకరికి సాధ్యం కాదు,” అని వివరణ ఇచ్చారు.

“ప్రస్తుతం సమాజంలో అందరికీ తెలిసిన ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ తో చెప్తే బాగుంటుంది అనుకున్నాను. వాళ్లకూ ఈ పాయింట్ నచ్చింది. ట్రైలర్ లో దాని గురించి మేం ప్రస్తావించలేదు. థియేటర్లో చూస్తేనే బాగుంటుంది,” అని అన్నారు.

“ట్రైలర్ లో ఉన్న ఎంటర్ టైన్మెంట్ సినిమాలో కూడా ఉంటుంది. కానీ వినోదంతో పాటు హార్ట్ టచింగ్ గా ఉంటుంది మూవీ,” అని ధీమా వ్యక్తం చేశారు శివ నిర్వాణ.

Advertisement
 

More

Related Stories