
సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా “మిస్టర్ ప్రెగ్నెంట్” అనే సినిమా రూపొందింది. ఈ వీకెండ్ (ఆగస్టు 18న) విడుదలవుతోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన ఈ సినిమాతో శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాటల్లోనే.
– మాది ఒంగోలు. సాఫ్ట్ ఇంజినీర్ అమెరికాలో పనిచేశాను. డైరెక్షన్ మీద ఇంటరెస్ట్ తో ఇటు వచ్చా.
– నిర్మాతల కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు ఈ కథ విన్న విని ఎమోషనల్ అయ్యారు. అలా నిర్మాత కూడా ఇన్స్పైర్ ఈ సినిమా నిర్మించారు. ఈ కథకు పాపులర్ హీరో ఐతే బాగుంటుంది అనుకున్నాం. కానీ, వర్కవుట్ కాలేదు. “బిగ్ బాస్”లోకి వెళ్లకముందే సోహైల్ కథ తెలుసుకొని ఈ సినిమా చేస్తాను అని ముందుకొచ్చాడు. బిగ్ బాస్ తో అతనికి పేరు రావడంతో సోహైల్ తోనే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం.
– నా నా పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల స్పూర్తితో ఈ కథ రాశాను.
– గర్భవతుల కష్టాలు చూస్తే జనం బోర్ ఫీల్ అవుతారు. అందుకే, ఈ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఒక లవ్ స్టోరీగా మలిచాం. మగాడు గర్భం దాల్చడం అనే పాయింట్ కొంతమందికి ఇబ్బంది అనిపించొచ్చు. కానీ, సినిమా చూస్తే ఇందులోని ఎమోషన్ కి అందరూ కదిలిపోతారు. ప్రొడ్యూసర్స్ మూవీ మేకింగ్ లో అన్ని విధాలా నాకు సపోర్ట్ చేశారు. మంచి టెక్నీషియన్స్ ను ఇచ్చారు. నేను ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలే రూపొందిస్తాను.