నేను ఖాళీగా లేను – తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఎందుకా దర్శకుడు సినిమాలు తీయడం లేదు? యాక్టింగ్ వైపు వెళ్లిపోయాడా? ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు తీసుకొని అటువైపే సెటిల్ అయిపోతాడా? మరీ ముఖ్యంగా వెంకటేష్ తో తీయాల్సిన సినిమా ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ తరుణ్ సమాధానం ఇచ్చాడు.

“ఓ పెద్ద హీరో (వెంకటేష్)తో సినిమా చేయాల్సి ఉంది. కాస్త ఆలస్యం అనుకున్నాను. కానీ బాగా ఆలస్యమైపోయింది. వచ్చే ఏడాది తప్పకుండా చేస్తాను. 2023లో కచ్చితంగా స్టార్ట్ అవుతుంది.”

ఇలా వెంకటేష్ తో నెక్ట్స్ సినిమా తప్పకుండా సినిమా ఉంటుందని ప్రకటించాడు తరుణ్ భాస్కర్. మరి ఈ గ్యాప్ లో ఏం చేయబోతున్నాడు? దీనికి కూడా తరుణ్ వద్ద సమాధానం ఉంది. తను ఖాళీగా లేనంటున్నాడు ఈ దర్శకుడు.

“ఓ క్రైమ్ కామెడీ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. వెంటనే సెట్స్ పైకి వచ్చేది అదే. ఈ సినిమాతో పాటు ఓరుగల్లు అనే టైటిల్ తో వెబ్ సిరీస్ చేయబోతున్నాను. అది నా డ్రీమ్ ప్రాజెక్టు లాంటిది. వీటితో పాటు సింగీతం శ్రీనివాసరావుతో ఓ మంచి స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తుంది.”

ఇకపై తన నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయంటున్నాడు ఈ దర్శకుడు. ఓ వైపు నటిస్తూనే, మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ డైరక్ట్ చేస్తానని చెబుతున్నాడు.

 

More

Related Stories