
అనిల్ రావిపూడి కథ రాసి, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు … “గాలి సంపత్” అనే సినిమా కోసం.
ఫలితం: అట్టర్ ఫ్లాప్
‘జాతిరత్నాలు’ డైరెక్ట్ చేసి పాపులర్ అయిన దర్శకుడు అనుదీప్ … కథ రాసి, అన్ని తానై ప్రచారం చేసిన మూవీ… ‘ఫస్ట్ డే ఫస్ట్ షో”. శుక్రవారం విడుదలైంది.
ఫలితం: డిజాస్టర్
గ్యాప్ దొరికింది కదా అని తానే కథ రాసి, డైరెక్ట్ చేశారు మారుతి. అదే “మంచి రోజులొచ్చాయి” అనే చిత్రం.
ఫలితం: అట్టర్ ఫ్లాప్
తక్కువ టైంలో డబ్బు సంపాదిద్దామనే యావలో దర్శకులు చేసే ఇలాంటి ‘చిలకొట్టుడు’ ప్రయోగాలు తేడా కొట్టేస్తున్నాయి. మంచి కథ ఉంది చేద్దామనుకునే బదులు ఒక ‘ప్రాజెక్ట్ సెట్ చేద్దామనుకుంటే’ ఇలా అవుతుంది అని తేలింది. అదే జరిగింది ఈ సినిమాల విషయంలో.
మారుతి, అనిల్ రావిపూడిలకు సమస్య లేదు ఎందుకంటే. వాళ్ళ చేతిలో పెద్ద హీరోలు ఉన్నారు. పెద్ద చిత్రాలున్నాయి. కానీ, ఇద్దరికీ ఆ సినిమాలు పెద్ద ఝలక్’ ఇచ్చాయి. ఇప్పుడు యువ దర్శకుడు అనుదీప్ కి పెద్ద గుణపాఠం జరిగింది. షార్ట్ ఫిలిం కథలు అన్ని సార్లు వర్కవుట్ కావని అర్థమైంది.