ఒకటి వచ్చింది, మూడు లైన్లో

Disha Patani

దిశా పటాని ఇటు సౌత్ సినిమాలు, అటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది ఆమె ఒక సినిమా విడుదల చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన “యోధా” సినిమా గత శుక్రవారం (మార్చి 15) విడుదలైంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. మొదటివారం ఇండియాలో 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ తెలుగు, తమిళ చిత్రాలపైనే.

ఆమె తెలుగులో “కల్కి 2898AD” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ తో హాట్ హాట్ డ్యూయెట్లు కూడా చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఆమె జీవితాన్ని మార్చేసే సినిమా. అలాగే తమిళంలో ఆమె సూర్య సరసన “కంగువ” అనే సినిమా చేసింది. ఇది కూడా భారీ చిత్రమే. ఇటీవలే విడుదలైన టీజర్లో విజువల్స్ అదిరిపోయాయి. ఆమెకి తమిళంలో బెస్ట్ లాంచ్ అని చెప్పొచ్చు.

ఈ రెండు సౌత్ సినిమాలతో పాటు మరో బాలీవుడ్ చిత్రం కూడా నిర్మాణంలో ఉంది. ఈ మూడు సినిమాలు హిట్ అయితే ఆమె గ్రాఫ్ పెరుగుతుంది.

Disha Patani’s stunning look in satin gown

Disha Patani

దిశా ఇంతకుముందు తెలుగులో “లోఫర్” అనే సినిమా చేసింది. కానీ అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. హిట్స్, ఫ్లాప్స్ సంబంధం లేకుండా క్రేజ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లోనే 60 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె పాపులారిటీ.

యాడ్స్, ఇన్ స్టాగ్రామ్ తో ఆమె బాగా సంపాదిస్తోంది. ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయితే ఆమె క్రేజ్ మరింత పైకి వెళ్తుంది.

Advertisement
 

More

Related Stories