దిశాని వద్దనుకున్నది అందుకే

- Advertisement -

దిశా పటాని… ‘సలార్’ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్. ప్రభాస్ సరసన ఈ భామ అయితే బాగుంటుంది అని భావించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఐతే, ఈ బాలీవుడ్ భామ ఇప్పటికిప్పుడు 60 రోజుల పాటు డేట్స్ ఇవ్వాలంటే కష్టం అని చెప్పింది. దాంతో ఆమెని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇద్దరు సౌత్ ఇండియన్ హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నారు. ఒక హీరోయిన్ ఆల్మోస్ట్ కాన్ఫర్మ్ అయినట్లే. రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.

‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలోనే మొదలు కానుంది. స్పీడ్ గా సినిమాని పూర్తి చెయ్యాలనేది ప్లాన్. అందుకే బల్క్ గా డేట్స్ ఇచ్చే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే, ప్రభాస్ సరసన ఇంతకుముందు నటించని భామనే తీసుకోవాలని అనుకున్నారట.

బాలీవుడ్ భామ దిశా పటాని సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. మరో చిత్రం షూటింగ్ లో ఉంది.

 

More

Related Stories