
హీరోయిన్ దిశ పటాని చాలా కాలం హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ లో ఉంది. కానీ ఇటీవలే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఎవరి దారి వారిది. ఐతే, రీసెంట్ గా ఈ అమ్మడు ఎక్కువగా అలెక్స్ అనే ఫారీన్ బాబుతో కనిపిస్తోంది. రెస్టారెంట్, పబ్బు… ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమెతో అలెక్స్ దర్శనమిస్తున్నాడు.
దాంతో, అలెక్స్ ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ (BF) అని అందరూ అనుకుంటున్నారు. మీడియా కూడా అదే రాస్తోంది. ఐతే, తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆతన్ని BFF అని సంభోదించింది.
BFF అంటే బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం. అలెక్స్ తన బాయ్ ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పింది అన్నమాట. సరే, అదే నిజం అనుకుందాం. కానీ అతను ఆమె ముఖాన్ని తన భుజంపై టాట్టూగా వేయించుకున్నాడు. మరి, అదేంటో?
తన అందచందాల షోతో కుర్రకారుని ఫిదా చేస్తుంటుంది దిశ. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫొటోలు మామూలుగా ఉండవు.

బాలీవుడ్ లో మంచి క్రేజున్న ఈ సుందరి ప్రస్తుతం దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. సూర్య హీరోగా నటిస్తున్న “కంగువ” అనే చిత్రంలో దిశ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన “కల్కి 2898AD”లో కనిపించనుంది. దీపిక పదుకోన్ మెయిన్ హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా దిశ నటిస్తోంది.