దిశా పటానికే ఎక్కువ ఛాన్స్!

Disha Patani

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానికి చాలా క్రేజ్ ఉంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో కనిపించింది. తన అందచందాల ఆరబోతతో ఇప్పటికే కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొంది. ఆమెని టాలీవుడ్ కి రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంది. సుకుమార్ సినిమా అన్న తర్వాత ఐటెం సాంగ్ లేకపోతే ఎలా? ఈ పాటని ఆమెతో చేయించాలని అనుకుంటున్నారట.

ఈ భామ ఇటీవల అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఫిదా అయిపోయింది. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో బుట్ట బొమ్మ పాటకు బన్నీ చేసిన డ్యాన్స్ చూసి గొప్పగా సోషల్ మీడియాలో పొగిడింది. ఆమె పోస్ట్ చూసి బన్నీ ఉబ్బితబ్బిబ్బు అయి ఆమెకి థాంక్స్ చెప్పాడు. ఇప్పుడు ఆమెని తన సినిమాలో ఐటెం సాంగ్ చేయించాలని భావిస్తున్నాడట.

మరి దిశా పటాని తెలుగు పాటకి సై అంటుందా అనేది చూడాలి.

Also Read: రాధే రివ్యూ: ఏందీ భాయ్ ఇది!

Disha Patani

‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగంలో ఐటెం సాంగ్ ఉండకపోవచ్చని అంటున్నారు. రెండో పార్టులోనే స్పెషల్ సాంగ్ కి చోటు ఉందట. కానీ సుకుమార్ చివరి నిమిషంలో మనసు మార్చుకొని మొదటి పార్టులో కూడా స్పెషల్ సాంగ్ పెట్టొచ్చు. హి లవ్స్ ఐటెం సాంగ్స్ మరి.

Advertisement
 

More

Related Stories