దిశ అడిగినంత ఇస్తారా?

Disha Patani

సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ కంపల్సరీ. తొలి సినిమా “ఆర్య” నుంచి “రంగస్థలం” వరకు…ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్ లు బాగా పాపులర్ అయ్యాయి. లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరో గా “పుష్ప” సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ “కిరాక్” సాంగ్స్ ఇచ్చాడట. ఇది కూడా “రంగస్థలం” మించి మ్యూజికల్ హిట్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ మూవీలో ఐటెం సాంగ్ ఎవరు చెయ్యనున్నారు?

“రంగస్థలం”లో పాపులర్ హీరోయిన్ పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. “పుష్ప” కోసం బాలీవుడ్ భామ దిశా పటానిని అప్రోచయ్యారని చాలాకాలంగా మాట వినిపిస్తోంది. ఐతే, మేకర్స్ మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఇక లేటెస్ట్ గాసిప్ ప్రకారం… ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించేందుకు… దిశా పటాని ఏకంగా కోటిన్నర రూపాయలు అడిగిందిట. హీరోయిన్ రష్మిక పారితోషికం రేంజ్ లోనే ఐటెం సాంగ్ కి అంత అడిగిందట. మరి దిశ అడిగినంత ఇస్తారా?

More

Related Stories