మరికొన్ని రోజుల్లోనే దివి పెళ్లి!

- Advertisement -
Divi Stills 170122 002

దివి వద్థ్య అనే ఈ భామ బిగ్ బాస్ తో పాపులర్ అయింది. బిగ్ బాస్ లో ఫైనల్ కి చేరుకోలేదు కానీ సినిమా అవకాశాలు బాగానే అందిపుచ్చుకొంది. సోషల్ మీడియాలో కూడా క్రేజ్ తెచ్చుకొంది. ఈ భామ తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడింది.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో “నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు” అనే ప్రశ్నకు… ఆమె మరి కొద్ది రోజుల్లోనే అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో, ఎవరిని చేసుకుంటున్నావు అంటూ ఆమెకి ప్రశ్నలు పడుతున్నాయి.

కానీ ఆమె వీడియో చూస్తే అదేదో ప్రమోషన్ లా ఉంది. ఏదైనా కార్యక్రమంలో నటించినప్పుడో, ఏదైనా యాడ్ చేసినప్పుడో ఇలాంటి గిమ్మిక్కులు చేస్తుంటారు సెలెబ్రిటీలు. అభిమానులని అలా ఊరించి… ఆ తర్వాత అది ప్రొమోషన్ లో భాగం అని తెలుస్తారు.

దివి చేసిన ఈ వీడియో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆమెకి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ టైంలో పెళ్లి చేసుకుంటుంది అని అనుకోలేం.

More

Related Stories