దాని తర్వాతే రెచ్చిపోతోందిగా!

ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఆమె కనిపించింది పూర్తిగా డీగ్లామ్ లుక్ లో. సునీల్ కి భార్యగా, చిరంజీవిపై ఆరోపణలు చేసిన ఒక అనాథ యువతిగా నటించింది దివి వథ్య. ‘బిగ్ బాస్’తో పాపులర్ అయిన బ్యూటీ నటించిన మొదటి పెద్ద సినిమా ఇదే.

బహుశా ఇలాంటి లుక్ లో చూసిన సినీ జనం ఇకపై తనకు పనమ్మాయి తరహా పాత్రలే ఇస్తారేమో అని భయపడుతున్నట్లు ఉంది ఈ భామ. అందుకే, ‘గాడ్ ఫాదర్’ విడుదల తర్వాతే ఆమె ఫోటోషూట్ లతో రెచ్చిపోతోంది.

ఆమె చేస్తున్న ఫోటోషూట్ లలో అందాల ప్రదర్శన మాములుగా ఉండడం లేదు. ఈ మాత్రం సిగ్గుపడకుండా సోయగాల షో చేస్తోంది. తనని గ్లామర్ భామగా గుర్తించండి బాబూ అన్నట్లు హింట్ ఇస్తోంది.

ALSO CHECK: Divi in Italy

సినిమా ఇండస్ట్రీలో ఒక సారి ఒక నటికి ఒక పాత్రతో గుర్తింపు వస్తే అన్ని అలాంటి పాత్రలే వస్తాయి. ‘గాడ్ ఫాదర్’లో చేసిన పాత్రలే వస్తే తన కెరీర్ మటాష్ అని భయపడి ఇలా ఫోటోషూట్ లతో రెచ్చిపోతోంది.

దివి హీరోయిన్ గా కూడా ఒక రెండు సినిమాలు చేసింది. కానీ, అవి విడుదలకు నోచుకోవడం లేదు. సో, ఈ గ్యాప్ లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు, ఫాలోవర్స్ కి, ఇండస్ట్రీ మేకర్స్ కి అందాల కనువిందు చేస్తోంది.

ALSO CHECK: Divi Vadthya in her thoughts

 

More

Related Stories