- Advertisement -

‘బిగ్ బాస్’లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకున్న భామ.. దివి. ఈ బ్యూటీ తాజాగా హీరోయిన్ గా మారింది. ఆమెని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నది ప్రముఖ యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇటీవల ‘బంగార్రాజు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారారు.
ఆయన సమర్పణలో నిర్మాత జీకే మోహన్ ఈ సినిమాని తీస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లంబసింగి అనే పేరు ఖరారు అయింది. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక.
భరత్ అనే యువకుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్రం నుండి మొదటి పాట ”నచ్చేసిందే నచ్చేసిందే” విడుదల కానుంది. ఈ రోజు పాటకు సంబధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీని సిద్ శ్రీరామ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.