నన్ను ఏడిపించారు: దివి

Divi

హీరోయిన్ దివి నటించిన చిత్రం “లంబసింగి” ఈ రోజు విడుదలైంది. థియేటర్లలోకి వచ్చింది ఈ మూవీ. “సోగ్గాడే చిన్ని నాయన”, “బంగార్రాజు” వంటి సినిమాలు తీసిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి సహ నిర్మాత.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం ఇచ్చిన ఇంటర్వ్యూలలో దివి వడ్త్యా చాలా విషయాలు బయట పెట్టింది. తనని పలువురు దర్శక, నిర్మాతలు అవమానించారని చెప్పింది. హేళన చేసినట్లు పేర్కొంది. తన డ్యాన్స్ విషయంలో వంక పెట్టారట. అలాగే ఇచ్చిన ప్రామిస్ లు తప్పారట.

ముఖ్యంగా రవితేజ సరసన హీరోయిన్ గా తీసుకొని ఆ తర్వాత తొలగించడం తనని బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పింది. కెరీర్ మొత్తం తలకిందులు అయింది అని పేర్కొంది. రవితేజ సరసన హీరోయిన్ గా నటించి ఉంటే ఈ రోజు తన క్రేజ్ వేరుగా ఉండేది.

ఇలా తనని ఏడిపించిన సంఘటనలు చెప్పింది కానీ ఏడిపించిన వారి పేర్లను బయటపెట్టలేదు ఈ భామ.

Advertisement
 

More

Related Stories