
‘డీజే టిల్లు’ అంచనాలు మించింది. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాకి ఈ రేంజు ఓపెనింగ్స్ రాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా అన్ని చోట్లా మొదటి రోజు ఈ సినిమా సూపర్ కలెక్షన్లను చూసింది.
హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సుదర్శన్ 35లో అన్ని ఆటలు హౌస్ ఫుల్ కావడం అంటే ఎలాంటి ఓపెనింగ్ వచ్చిందో చెప్పక్కర్లేదు. అమెరికాలో ప్రీమియర్ షోకి 100కే (లక్ష డాలర్లు) రావడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ తోనే ఆకట్టుకొంది. దాంతో, యూత్ మొదటిరోజే థియేటర్ల వైపు క్యూ కట్టారు. క్రిటిక్స్ కూడా సినిమాలో ఉన్న ఎలిమెంట్ కి ఓటేశారు. సెకండాఫ్ కాస్త అటుఇటుగా ఉన్నా… ఎంటర్ టైన్మెంట్ కి ఢోకా లేదు అని తేల్చారు. ఈ సినిమా ఓపెనింగ్ తో హీరో సిద్ధు జొన్నలగడ్డకి క్రేజ్ పెరిగినట్లే.
ఈ మధ్య సక్సెస్ అయిన యువ హీరోల జాబితాలో సిద్దు కూడా చేరాడు.
ALSO READ: Tillu Review: A wacky fun ride!