నోటుకి ఓటొద్దు, విజయ్ స్పీచ్ వైరల్

Vijay


తమిళనాడులో విజయ్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన త్వరలో పార్టీ పెడతారని, సి.ఎం అవుతారని ఆయన అభిమానులు చాలాకాలంగా చెపుతున్నారు. కానీ విజయ్ మాత్రం ఆ విషయంలో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. కానీ సడెన్ గా నేటి రాజకీయాల గురించి కామెంట్ చేసి కలకలం రేపారు.

ఓటుకోసం నోటు ఇస్తున్నారంటే ఆ వ్యక్తి, ఆ పార్టీ ఎంత సంపాదించి ఉంటుందో అర్థం అవుతుంది కదా. మీరు భవిష్యత్ ఓటర్లు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నోటు తీసుకునే ఓటు వేయొద్దు. ప్రలోభాలకు లొంగకుండా మంచి వారికి మాత్రమే ఓటు వెయ్యాలి,” అని విజయ్ తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడారు.

తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ మీడియట్ లో మొదటి 1, 2 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు విజయ్. ఈ సందర్భంగా ఆయన చేసిన స్పీచ్ వైరల్ అయింది. విజయ్ వయసు 48 ఏళ్ళు. 50 దాటిన తర్వాత రాజకీయాల గురించి ఆలోచిస్తాడని టాక్. ప్రస్తుతం ఆయన తన అభిమానులనే కార్యకర్తలుగా మలుచుకునే పనిలో ఉన్నారు.

విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. అక్టోబర్ లో ఈ మూవీ విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories