
మెగాస్టార్ చిరంజీవి వయస్సు 66. ఈ ఏజ్ లో కూడా ఆయన చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు. డ్యాన్స్ లు, ఫైట్స్ విషయంలో కూడా డూప్ కి నో చెప్తున్నారట.
వయసులో ఉన్న హీరోలే డూప్ లతో యాక్షన్ సన్నివేశాలు చేయించుకుంటున్న టైంలో ఆయన ఇటీవల ఒక సినిమా షూటింగ్ లో స్వయంగా ఫైట్ చేశారు. అయితే ఆయన ఎక్కిన జంతువు వేగంగా దూకడంతో చిరంజీవి కిందపడ్డారు. స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనని పరీక్షించిన వైద్యులు ఇలాంటి రిస్కులు చేయొద్దని సూచించారట.
“లక్కీగా మీకు ఏమి కాలేదు ఈ ఘటనలో. సాధారణంగా నడుము కానీ, కాలు కానీ బ్రేక్ అవుతుంది ఇలాంటి సందర్భాల్లో. మీ వయసులో అలా జరిగితే చాలా ఇబ్బంది. దయచేసి, ఇలాంటి రిస్క్ లు చేయకండి,” అని డాక్టరు చిరంజీవికి సలహా ఇచ్చారు. దాంతో, ఆయన దర్శకులే ఇప్పుడు రిస్కీ ఫైట్లు ప్లాన్ చెయ్యడం మానేశారట.
‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేర్ వీరయ్య’… ఇవి ఆయన చేస్తున్న చిత్రాలు. అన్నిట్లోనూ యాక్షన్ సీన్స్ ఎక్కువ.