ఆ తమిళ చిత్రంతో పోలిక!

- Advertisement -
HI Nanna

నాని, మృణాల్ ఠాకూర్ నటించిన “హాయ్ నాన్న” డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్ తో పాటు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది టీం. నాని, మృణాల్, చిన్న పాప కియారా ఖన్నా పడుకున్న ఫ్యామిలీ ఫొటోతో కూడిన పోస్టర్ అది.

ఆ పోస్టర్ ని చూసిన చాలా మంది ఆ మధ్య విడుదలైన తమిళ చిత్రంలాగే ఉంది కదా అనుకోవడం మొదలుపెట్టారు. “దాదా” అనే తమిళ చిత్రానికి సంబంధించిన పోస్టర్ గురించే. హీరో, హీరోయిన్, ఒక బాబు ఇలాగే పడుకున్న ఫ్యామిలీ పోస్టర్ అది. “హాయ్ నాన్న”కి, “దాదా”కి ఏంటి సంబంధం? ఇది ఆ తమిళ చిత్రానికి రీమేకా? అనుమానాలు వస్తున్నాయి.

ఐతే, ఇది రీమేక్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఈ సినిమా ద్వారా శౌరీవ్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను నానికి కథ చెప్పి చాలాకాలమే అయింది. కాకపోతే సినిమా షూటింగ్ కి వెళ్లడం లేట్ అయింది.

అదీ కాకుండా, “హాయ్ నాన్న”లో శృతి హాసన్ కూడా ఉంది. ఆమెది గెస్ట్ రోల్. కానీ సినిమా కథకి కీలకం. తమిళ చిత్రంలో అలాంటి అంశం లేదు.

Dada

సో, రీమేక్ అయ్యే ఛాన్స్ లేదు అనేది ఒక మాట. సినిమా విడుదల తర్వాత కానీ అసలు సంగతి బయటపడదు.

 

More

Related Stories