కొత్త ఫిలిం సిటీ ఎందుకు?

Pragathi Bhavan

హైదరాబాద్ లో అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియో బాగానే నడుస్తోంది. ఆల్రెడీ ఎన్కౌంటర్ శంకర్, వినాయక్ కూడా స్టూడియో ఫ్లోర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా… హైదరాబాద్ లో వందల ఎకరాల్లో ఫిలిం సిటీ అవసరమా?

నిన్న చిరంజీవి, నాగార్జున కేసీఆర్ ని కలిసినప్పుడు… మరో 1500 ఎకరాల్లో హైదరాబాద్ శివార్లలో ఇంకో ఫిలిం సిటీ ఏర్పాటు చెయ్యాలని ప్రకటించారు. ఇది పొలిటికల్ ఎత్తుగడ కావొచ్చు కానీ ఇంకో ఫిలింసిటీ నిజంగా అవసరం ఉందా అన్నదే ప్రశ్న.

గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ … రాచకొండ ఫిలిం సిటీ అని చెప్పి అక్కడ భూములు ఇస్తామని ప్రకటించారు. కానీ అప్పుడు ఇండస్ట్రీ పెద్దగా రెస్పొండ్ కాలేదు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. దాంతో భూముల కోసం ఇండస్ట్రీ వాళ్ళు పరితపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమ అభివృద్ధి కోసమే భూములు ఇస్తే అర్థముంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ పాతుకుపోయింది. పరిశ్రమ “అభివృద్ధి” కోసం మళ్ళీ భూముల పందేరం చెయ్యాల్సిన అవసరం లేదు.

“ఆంధ్రోళ్లు” హైదరాబాద్ చుట్టూ భూములు కాజేశారని గతంలో ఆరోపణలు చేసి… ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అదే తప్పు చెయ్యడం ఏంటి? భూముల కోసమే మెగాస్టార్, నాగార్జున తెలంగాణ ప్రభుత్వంతో సీక్రెట్ చర్చలు జరుపుతున్నారు అని ఆ మధ్య నందమూరి బాలకృష్ణ చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement
 

More

Related Stories