‘దొంగ’ అడ్డంగా దొరికాడు

Karthi

ఈ వారం (ఆగస్ట్ 29-సెప్టెంబర్ 4) బుల్లితెరపై ప్రసారమైన సినిమాల్లో అందరి చూపు కార్తి నటించిన ‘దొంగ’ సినిమాపై పడింది. నిజానికి ఆ వారం ప్రసారమైన కొత్త సినిమాల్లో ఉన్నది అదొక్కటే. కాబట్టి కాస్త మెరుస్తుందని అంతా భావించారు. కానీ కార్తి సినిమా టీఆర్పీల్లో తేలిపోయింది. జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 3.44 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ వచ్చింది.

థియేటర్లలో ఫ్లాప్ అవ్వడంతో పాటు ఓటీటీలో ఇప్పటికే వచ్చేయడంతో ఈ సినిమాను టీవీల్లో చూసేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనే విషయం తాజా రేటింగ్ తో తేలిపోయింది. రియల్ లైఫ్ మరిది-వదిన కార్తి-జ్యోతిక కలిసి చేసిన సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని భావించిన సదరు ఛానెల్ కు షాకిచ్చాడు దొంగ.

ఇక ఈ వారం టాప్-5 సినిమాల్లో బన్నీ నటించిన ‘రేసుగుర్రం’ (5.80 అర్బన్) టాప్ లో నిలవగా.. ‘కేజీఎఫ్ ఛాప్టర్-1’ (5.12 అర్బన్) రెండో స్థానంలో.. ‘ధర్మయోగి’ (4.07 అర్బన్) మూడో స్థానంలో.. ‘విశ్వాసం’ (3.60 అర్బన్) నాలుగో స్థానంలో.. ‘దొంగ’ (3.44 అర్బన్) ఐదోస్థానంలో నిలిచాయి.

ఛానెళ్ల ఓవరాల్ రేటింగ్స్ చూస్తే.. స్టార్ మా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈటీవీ రెండో స్థానంలో, జీ తెలుగు మూడోస్థానంలో ఉన్నాయి. స్టార్ మా ఛానెల్ లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-4 ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ వచ్చే వారం వస్తుంది. అప్పుడు చాలా లెక్కలు మారే అవకాశం ఉంది.

Related Stories