- Advertisement -

హీరోయిన్ నయనతారని లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఆమె నటించే సినిమాల్లో టైటిల్స్ లో కూడా అలాగే వేస్తారు. కానీ అని తనను అలా పిలిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్తోంది నయనతార.
నయనతార మొన్నటి వరకు ఈ టైటిల్ ని బాగానే ఎంజాయ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరుతో పిలిస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తోంది అని చెప్తోంది. కారణమేంటో?
నయనతార ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి హిందీ చిత్రం “జవాన్” పెద్ద హిట్ అయింది. ఐతే, తమిళంలో ఆమె నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇటీవలి కాలంలో పెద్దగా ఆడడం లేదు. బహుశా అందుకే ఇలా ఫీల్ అవుతుందేమో.