బికినీ తప్ప వేరే కనిపించదా: దీపిక

Deepika Padukone

దీపిక పదుకోన్ నటించిన కొత్త చిత్రం … ఫైటర్. ఈ సినిమాలో ఆమె హృతిక్ సరసన నటించింది. హృతిక్ తో ఆమె నటించడం ఇదే మొదటిసారి.

“ఫైటర్” టీజర్ ఇటీవల విడుదలైంది. 5 సెకండ్ల పాటు ఉండే ఆమె బికినీ అందాలు బాగా హైలెట్ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన “పఠాన్” సినిమాలో కూడా ఆమె ఒక పాటలో మొత్తం బికినీలోనే ఉంటుంది. ఆ సినిమాని తీసింది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు “ఫైటర్” చిత్రానికి కూడా అతనే దర్శకుడు. అందుకే కాబోలు దీపికతో బికినీలో రొమాన్స్ చేయించాడు.

“పఠాన్” సినిమా విడుదలైనప్పుడు ఆమె బికినీ అందాల షో గురించి చాలా కాంట్రవర్సీ నడిచింది. ఆ పాటలో ఒక చోట ఆమె కాషాయ బికినిలో కనిపిచింది. పవిత్రమైన కాషాయ రంగుని అలా బికినీలకు వాడుతార అంటూ హిందూ సంఘాలు గొడవ చేశాయి. ఇప్పుడు అలాంటి వివాదం ఏమి రాలేదు కానీ దీపికకి మాత్రం కోపమొచ్చింది. ఆ టీజర్ దేశభక్తి చాటేలా ఉంది కదా. అయినా 5 సెకన్ల బికినీపై మీ చూపు పడిందా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

హీరోయిన్ల బికినీ సీన్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేసే సంస్కృతి పోవాలంటే మీడియా కూడా ఇలాంటి సన్నివేశాలకు ఎక్కువ ప్రచారం ఇవ్వొద్దు అని దీపికా అంటోంది.

ALSO READ: Fighter teaser: Deepika Padukone’s bikini clip goes viral

రొమాన్స్, సాంగ్స్ లో అలాంటివి తప్పవు. కాబట్టి వాటిని కాకుండా హీరోయిన్ల నటన గురించి మంచి మాటలు రాస్తే మార్పు వస్తుంది అన్న ఆమె ఆలోచన కరెక్ట్. ఇక దీపిక నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఆమె ప్రభాస్ సరసన “కల్కి” సినిమాలో నటిస్తోంది.

 

More

Related Stories