‘పాన్ ఇండియా’ బోర్ కొట్టింది: దుల్కర్

ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హీరోలు అందరూ అన్ని భాషల్లో తమ సినిమాలను విడుదల చేస్తూ మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందగాడైన దుల్కర్ సల్మాన్ కి ఇప్పటికే ఆ ఇమేజ్ ఉంది.

ఈ మలయాళ హీరో అన్ని భాషల్లో సినిమాలు చేశారు. అంతటా క్రేజ్ ఉంది. ఐతే, ‘పాన్ ఇండియా’ అనే పదం బోర్ కొట్టింది అంటున్నారు దుల్కర్.

ఆయన తెలుగులో నటించిన తాజా చిత్రం…’సీతారామం’. ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దుల్కర్.

“పాన్ ఇండియా అని విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా న్యూస్ రాయడం లేదు, ఇంటర్వ్యూ చెయ్యడం లేదు. ఈ కాన్సెప్ట్ కొత్త కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్…. ఇలా ఎంతో మంది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనిపించారు. వారి సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ ప్రచారం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు,” ఇది దుల్కర్ సల్మాన్ మాట.

Advertisement
 

More

Related Stories