‘డబుల్ ఇస్మార్ట్’ రాక మరింత ఆలస్యం

Ram Pothineni

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న చిత్రం… డబుల్ ఇస్మార్ట్. సాధారణంగా తన సినిమాలను పూరి చాలా వేగంగా తీస్తారు. కానీ ఈ సినిమా నిర్మాణం మాత్రం మందకోడిగా సాగుతోంది. ఇంకా చాలా భాగం చిత్రకీరించాలి.

ఇంతకుముందు ఈ సినిమాని మార్చి 8, 2024న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత షూటింగ్ ఆలస్యం అవుతుంది అని భావించి జూన్ 14కి సినిమాని వాయిదా వేశారు. ఐతే, తాజా సమాచారం ప్రకారం ఆ డేట్ కూడా మారేలా ఉంది.

కారణం ఏంటో తెలీదు కానీ షూటింగ్ ప్రస్తుతం జరగడం లేదు. మళ్ళీ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ లో జరుగుతుందట. సో, షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి, ప్రొమోషన్ మొదలుపెట్టాలంటే ఇంకొంత టైం కావాలి. అందుకే ఈ సినిమా జూన్ లో కాకుండా జులైలో కానీ, సెప్టెంబర్ లో కానీ వచ్చే అవకాశం ఉంది.

ఇది సూపర్ హిట్టయిన “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండడం విశేషం. అలాగే, రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ నటిస్తోంది. ఈ భామ ఇటీవలే “ఈగిల్”, “ఊరు పేరు భైరవకోన” సినిమాల్లో నటించింది.

Advertisement
 

More

Related Stories