- Advertisement -

దీపిక పదుకోన్ నిర్మాతగా, హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తోంది. ఆమె డ్రీం ప్రాజెక్ట్… ద్రౌపది. ‘మహాభారత’ యుద్ధం ద్రౌపది వల్లే మొదలవుతుంది. ఐతే, ద్రౌపది కథని నేటి ఫెమినిస్ట్ పాయింట్ అఫ్ వ్యూని జోడించి చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఒక సినిమాని ప్రకటించింది. అందులో ద్రౌపది పాత్రని తానే పోషిస్తానని చెప్పింది.
రెండేళ్ల క్రితం ఈ సినిమాని ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా ఊసే లేదు. ఆగిపోయినట్లేనా?
“అలాంటిదేమి లేదు. ద్రౌపది సినిమా నా డ్రీం. గ్యారెంటీగా మొదలవుతుంది. కానీ చాలా టైమ్ పట్టడం ఖాయం. ఆ సినిమా పనులు సైలెంట్ గా సాగుతున్నాయి,” అని తెలిపింది దీపిక. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదే షూటింగ్ మొదలు కావొచ్చు అని చెప్తోంది.
ఈ అందాల భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ K’ అనే చిత్రంలో నటిస్తోంది.